వినయ విధేయ రామ సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే?

0
113
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన సినిమా వినయ విధేయ రామ. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ అద్భుతమని చెప్పాలి. ఇక దానితో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇకపోతే జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు కూడా విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు.
Image result for vinaya vidheya rama
కాగా కాసేపటి క్రితం ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇక సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా ఆద్యంతం ఎంతో అద్భుతంగా ఉందని, బోయపాటి మంచి కథాంశాన్ని తీసుకుని దానికి యాక్షన్ ని మిళితం చేసి తెరకెక్కించారని వారంటున్నారు. ఇక ఈ సినిమాలో వైలెన్స్ వున్న కారణంగా ఏ సర్టిఫికెట్ జరీ చేయడం జరిగిందట. మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here