వినయ విధేయ రామ రామ సాంగ్స్ పై రివ్యూ….! 

0
165
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భరత్ అనే నేను మూవీ ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్ గా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న కొత్త సినిమా వినయ విధేయ రామ. ఇటీవల రంగస్థలం సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై టాలీవుడ్ లో మరియు మెగాభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే యూట్యూబ్ లో విడుదల అయిన ఈ సినిమాలోని రెండు పాటలకు మంచి స్పందన లభించడంతో నేడు సినిమా యూనిట్ పూర్తి స్థాయి పాటల జ్యుక్ బాక్స్ ని నేడు యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఇక కాసేపటి క్రితం విడుదల అయిన ఈ సినిమాలోని పాటలకు ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తందానే, తస్సాదియ్యా, ఏక్ బార్, రామ్ లవ్స్ సీత, అమ్మ నాన్న పేరుతో మొత్తం ఈ సినిమాలో 5 పాటలు వున్నాయి.
Related image అయితే ఈ సినిమాలో బోయపాటి ఏక్ బార్ పేరుతో ఒక మాస్ పాటను కూడా మెగా ఫ్యాన్స్ కోసం పెట్టడం జరిగింది. ఇక ఈ ఆల్బమ్ మొత్తంగా అన్నిరకాల పాటలతో ఆకట్టుకునేలా వుంది అని చెప్పాలి. ఇక తన సినిమాలో ఎమోషన్స్ కు కూడా పెద్ద పీట వేసే బోయపాటి ఈ సినిమాలో కూడా మంచి ఎమోషన్స్ తో సాగె సన్నివేశాలను పెట్టినట్లు సమాచారం. ఇక తందానే తాందానే సాంగ్ అటువంటి ఫామిలీ ఎమోషన్స్ తో సాగనున్నట్లు ఆ పాట వింటే అందరికి అర్ధం అవుతుంది. ఇక రామ్ లవ్స్ సీత సాంగ్ మంచి డ్యూయెట్ అని అర్ధం అవుతోంది. ఇక అమ్మ నాన్న అనే పాత సినిమాలో సందర్భాన్ని పట్టి వస్తుందని తెలుస్తోంది. ఇక మొత్తంగా చూస్తే ఈ వినయ విధేయ రామ సినిమాలోని సాంగ్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి అనే చెప్పాలి. మరి ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతున్న ఈ సాంగ్స్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here