మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న వినయ విధేయ రామ ట్రైలర్…….!

0
74

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో సంక్రాంతికి విడుదల కానున్న సినిమా వినయ విధేయ రామ. ఇక కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్, సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆ ఫంక్షన్ లో ఆవిష్కరించడం జరిగింది. ఇక ఫంక్షన్ కు ప్రత్యేక అతిథులుగా మెగా స్టార్ చిరంజీవి, టిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేసి సందడి చేసారు. చరణ్ ఒక్కొక్క సినిమాతో ఎదుగుతూ సినిమా ఇండస్ట్రీ లో తన  స్థాయిని మరియు ఇమేజిని పెంచుకుంటూ పోతున్నారని కేటీఆర్ అన్నారు. ఇక తండ్రి చిరంజీవి గారిలానే  మంచితనం, మానవత్వం గల వ్యక్తి చరణ్ అని, ఇక గతంలో తాను ధ్రువ ఆడియో ఫంక్షన్ కు కూడా అతిథిగా విచ్చేసానని, ఆ సినిమావలే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని అయన అన్నారు.

Image result for vinaya vidheya rama

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తనకు గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు వంటి సినిమాలు ఎంతటి పేరును తీసుకువచ్చాయో, చరణ్ కు కూడా ఈ సినిమాతో మంచి మాస్ ఇమేజి తప్పకుండా వస్తుందని, దర్శకుడు బోయపాటి గారు సినిమాను తన ప్రాణం పెట్టి తెరకెక్కించారని అన్నారు. ఇక ట్రైలర్ ని అలా యూట్యూబ్ లో విడుదల చేసిన వెంటనే వేలాది లక్షలాది వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ దాదాపుగా 5 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి దూసుకుపోతోంది. ఇక ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి  చేర్చిందని, అంతేకాక ట్రైలర్ ని చూసిన కొందరు సినీ ప్రముఖులు కూడా అద్భుతం అంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో దుమ్మురేపిన ఈ సినిమా రేపు విడుదల తరువాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here