సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వినయవిధేయ రామ న్యూ పోస్టర్|telugugaramchai

0
113
రామ్ చరణ్ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా వినయ విధేయ రామ. ఇక జయ జానకి నాయక సినిమాతో  బోయపాటి, రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ మంచి ఫామ్ లో వున్న విషయం తెలిసిందే. ఇక వారిద్దరి కలయికలో రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన అంచనాలు వున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. అంతేకాక ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలైన రెండు పాటలు కూడా వీక్షకులకు బాగా చేరువై సినిమాపై అంచనాలు బాగా పెంచాయి. ఇకపోతే ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను రేపు హైదరాబాద్ లో నిర్వహించనుంది సినిమా యూనిట్. ఇక ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించించడం జరిగింది.
అంతేకాక ఈ వేడుకకు మెగాస్టార్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ కూడా రానున్నట్లు సమాచారం అందుతోంది. అయితే కాసేపటి క్రితం ఈ సినిమాలోని ఒక అద్భుతమైన పోస్టర్ ని తమ సోషల్ మీడియా వేదికల్లో విడుదల చేసారు సినిమా యూనిట్ వారు. ఆ పోస్టర్ లో చరణ్ గుర్రం పై స్వారీ చేస్తున్నట్లు గమనించవచ్చు. ఇక ఈ పోస్టర్ ని చూసిన మెగా ఫ్యాన్స్, ఇదివరకు రాజమౌళి, చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాని గుర్తుచేసుకుంటున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో చరణ్ ని బోయపాటి మరొక పవర్ ఫుల్ పాత్రలో చూపించినట్లు అర్ధం అవుతోందని, అలానే సినిమా కూడా రేపు విడుదల తరువాత అద్భుత విజయాన్ని తప్పక అందుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here