విశాల్ పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే…!!

0
75
సినీ నటుడు విశాల్‌ తెలుగు వారందిరికి బాగా సుపరిచితమే. అయన నటించిన పందెం కోడి, డిటెక్టివ్, అభిమన్యుడు, పూజ, జయసూర్య తదితర సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం ఆయనకు పెళ్లి నిశ్చయమైనదని అయన తండ్రి జివికె రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దానితో అమ్మయి ఎవరా అని, అలానే పెళ్లి ఇప్పుడా అని అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అయిన అనీశాతో ఆయన వివాహం జరగనున్నట్లు అయన తండ్రి ప్రకటన తరువాత వార్తలు వచ్చాయి. అయితే విశాల్‌ను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు. ‘పెళ్లిచూపులు’ చిత్రంలో విజయ్‌ దేవరకొండకు ప్రేయసిగా నటించిన యువతే. విజయ్‌ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలోనూ అనీశా నటించారు. ఇక నేడు ఆమె విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను అనీశా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.
News,Anisha,Vishan
‘కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. నా ఎదుగుదలలో, ఆలోచనల్లో స్ఫూర్తిగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నాకు సరైన తోడు దొరికింది. విశాల్‌ మంచి మనసు నాకెంతో నచ్చింది. విశాల్‌తో జీవితం పంచుకుని ఆయన్ను సంతోషంగా ఉంచడానికి నా బెస్ట్‌ నేను ప్రయత్నిస్తాను.’ అని అనీశా పేర్కొన్నారు. ఈ నెలలోనే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగబోతోందని విశాల్‌ తండ్రి వెల్లడించారు. పెళ్లి కూడా ఇక్కడే చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆమె పోస్ట్ పెట్టిన వెంటనే అది టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వారి జంటపై ఒక లుక్ వేయండి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here