యూట్యూబ్ దుమ్ముదులుపుతున్న వినయ విధేయ ఫస్ట్ సాంగ్….!

0
104

మొన్న సంక్రాంతికి అజ్ఞాతవాసి, జై సింహ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే అందులో జై సింహ మంచి విజయాన్ని అందుకోగా, అజ్ఞాతవాసి ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇక రాబోయే సంక్రాంతి 2018 కి టాలీవుడ్ లో క్రేజీ ఫైట్ జరగబోతుంది. ఒక పక్క క్రిష్, బాలయ్య ల ఎన్టీఆర్ కథానాయకుడు మంచి అంచనాలతో వస్తుంటే మరో పక్క రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత రామ్ చరణ్,ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి ల కాంబోలో వస్తున్న వినయవిధేయ రామ కూడా చాలా షార్ట్ గ్యాప్ లో వస్తుంది. వీటితోపాటు దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్2 కూడా రేస్ లో ఉన్నా కూడా ఈ రెండు సినిమాలపైనే అందరికి ఎక్కువగా అంచనాలు వున్నాయి. ఇప్పటికే వినయవిధేయ రామ మొదటి లుక్ టీజర్ తో అటు మాస్ కి,ఇటు క్లాస్ కి కూడా పూనకాలు తెప్పించాడు బోయపాటి. ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. తందానే తందానే అని సాగే ఈ సాంగ్, ఒక ఫ్యామిలీ సాంగ్ అని సినిమా యూనిట్ తమ ప్రకటనలో తెలిపింది.

ఇక వాళ్ళు చెప్పినట్లే సాంగ్ విజువల్స్ లో కూడా రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం, అలానే కొన్ని టూర్లకు వెళ్లడం వంటి సన్నివేశాలను చూపించాడు దర్శకుడు. ఇక ఈ పాట సాగే విధానాన్ని బట్టి చూస్తే ఇది ఒక ఫ్యామిలీ సాంగ్ అని అర్ధం అవుతోంది. అయితే సినిమాలో మంచి మాస్ అంశాలు కూడా ఉన్నాయని, సినిమాలో ఒక సందర్భంలో వచ్చే పాత కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని యూనిట్ సభ్యులు చెపుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ సరసన భరత్ అనే నేను భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. త్వరలోనే ఆడియో వేడుక జరుపుకోబోతున్న ఈ సినిమా మున్ముందు ఎంతవరకు రికార్డ్స్ చేస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు ఆగవలసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here