ఆ విషయమై పోరాటానికి జనసేనతో కలవడానికి సిద్ధం : చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

0
87
గత ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ జనసేన మద్దతిచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఆ సమయంలో ఉమ్మడి ఏపీ విడగొట్టబడి ఆంధ్ర, తెలంగాణ గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక ఆ విధంగా విడగొట్టబడడంతో రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటు అలానే నూతన రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు వంటి ఒక అనుభవజ్ఞుడు అవసరమని భావించి టీడీపీకి మద్దతిచ్చినట్లు పవన్ కళ్యాణ్ అప్పట్లో తెలిపారు. ఇకపోతే ఎన్నికల తరువాత తాము ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో కూడా టీడీపీ పూర్తిగా విఫలమైందని పవన్ ఇటీవల జనసేన పార్టీ పర్యటనల్లో భాగంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక గత ఎన్నికల సమయంలో కేంద్రంలో ఎన్డీయే లో భాగస్వామిగా నిలిచి బీజెపికి మద్దతిచ్చిన టిడిపి పార్టీవారు, తమకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని, అలానే రాష్ట్రానికి ఏ విధంగానూ సాయపడలేదని ఆ పార్టీపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశ పెట్టింది టీడీపీ. ఇక అది వీగిపోవడంతో చివరికి ఎన్డీయే నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్లి తమ విధి విధానాలు తెల్పడంలో మునిగిపోయాయి.
Image result for pawan kalyan and chandrababu naidu
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న మీడియాతో మాట్లాడుతూ, మేము మాత్రమే కాదు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మరియు బీజేపీ ప్రభుత్వం పై ప్రజలు ఎంతో ఆగ్రహంగా వున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చని మోడీ ప్రభుత్వంపై అందరూ కలిసి యుద్ధం చేయాల్సిని సమయం ఆసన్నమయిందని అన్నారు. అందువలన రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని గద్దె దించేందుకు పవన్ జనసేన పార్టీ తమతో కలిసి పని చేయడానికి ముందుకు రావాలని, అయన కనుక వస్తే, వారితో కలిసి పని చేయడానికి తాము సిద్ధమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమ పార్టీ ఎప్పుడూ పవన్ పార్టీకి వ్యతిరేకం అని చెప్పలేదని, అయితే బిజెపి చేసిన మోసానికి అందరం బలయ్యామని, అయితే అది గుర్తించని పవన్, తమపై మాత్రమే నింద మోపడం సరైనది కాదని, ఆ విషయమై అయన మరొక్కసారి పునరాలోచించాలని చంద్రబాబు తెలిపారు. అయితే అయన చేసిన వ్యాఖ్యలకు పవన్ నుండి ఎటువంటి స్పందన వస్తుందో తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఓపిక పట్టవలసిందే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here