ఎన్నికల్లో పోటీకి రెండు వేల కోట్లు కావాలి అంటున్న పవన్… మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
108
సినిమాలకు స్వస్తి పలికి ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, తన జనసేన పార్టీ ని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తానని అంటున్నారు. ఇక గతంలో తన అన్నయ్య చిరంజీవి గారు నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ కనుక ఇప్పుడు ఉండివుంటే అందరికి సామజిక న్యాయం జరిగి ఉండేదని అన్నారు. ఇక తాను ప్రజారాజ్యం పార్టీలో వున్నపుడు అన్నయ్యని చూసి ఎంతో గర్వపడేవాడిని అని, ఇక తాను పార్టీ పెట్టడానికి స్ఫూర్తి కూడా అన్నయ్యే అని ఆయన అన్నారు.
Image result for pavan chiranjeevi
పీఆర్పీ పార్టీ పెట్టిన సమయంలో పదవులపై వ్యామోహంతోనే కొందరు ఆ పార్టీని బలహీన పరిచి, చివరికి పార్టీ అంతర్ధానమయ్యేలా చేసారని వ్యాఖ్యానించారు. ఇక ఒకప్పటివలె రాజకీయాలు లేవని, ఇప్పుడు ఒక పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే దాదాపుగా రెండువేల రూపాయలు కావాలని అంటున్నారని అయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అయితే తమ పార్టీ మాత్రం నీతిగా, నిజాయితీగా డబ్బు  మరియు మద్యం పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని అయన స్పష్టం చేసారు. కాగా పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here