చంద్రబాబు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం : టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

0
78
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిజెఎస్, సీపీఐ తో జతకట్టిన టిడిపి పార్టీ, ఒక మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ప్రజల పక్షమైన మమ్మల్ని గద్దె దింపడం చంద్రబాబు వంటి వారు ఎందరు వచ్చినా కుదరదని, అంతేకాక తమ రాష్ట్రాన్ని వదిలి ఇక్కడకు వచ్చిన బాబుకి తప్పకుండ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని టిఆర్ఎస్ పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి కైసర్ ఇటీవల వ్యాఖ్యలు చేయడం అందరికి తెలిసిందే. ఇక నేడు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కచ్చితంగా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి తీరుతామని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూడపాడులో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..  తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రూ.5000 కోట్లతో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఏపీలో కూడా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి యాదవులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
Talasani Srinivas Yadav Criticizes Chandrababu Naidu - Sakshi
అక్కడ మీడియాతో మాట్లాడిన అయన ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.ప్రజల సొమ్ముతో ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన వాస్తవాలను దాచలేమన్నారు. టీఆర్‌ఎస్‌ కాదు, ఏపీ ప్రజలే చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కుల రాజకీయాలకు కారణం చంద్రబాబేనని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని అలానే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రభ్వుతం ఉన్న వాళ్లు భిన్న రకాలుగా మాట్లాడారని విమర్శించారు. హోదాకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఏపీలో కూడా టీడీపీకి గడ్డు రోజులు రాబోతున్నాయని, ఆ విషయాన్నీ గ్రహించి అధినేత చంద్రబాబు గారు ముందుకు సాగాలని ఆయనకు హిత బోధ చేసారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here