వైసిపి రాజీనామా చేయడంపై రాధా షాకింగ్ కామెంట్స్!

0
71
దివంగత నాయకులు వంగవీటి మోహన రంగ గారి తనయుడు వంగవీటి రాధా, నిన్న వైసిపి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మొదట చిరంజీవి ప్రజారోగ్యం పార్టీలో చేరిన అయన, ఆ పార్టీ తరపున ఓడిపోయిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. అయితే తరువాతి ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసిన అయన ఘోర ఓటమి పాలయ్యారు. ఇక గత కొద్దిరోజులుగా వైసిపి పార్టీ కార్యక్రమాల్లో అయిష్టంగా పాల్గొన్న రాధా,
నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసారు. అయితే నిజనైకి తనకు ఓర్పు ఎక్కువని, గత కొన్నినెలలుగా జగన్ గారిని విజయవాడ సెంట్రల్ సీటు అడుగుతున్నప్పటికీ కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడంతోనే తాను రాజీనామా చేసానని, ఎన్నాళ్ళనుండో పార్టీ తరపున తాను కష్టించి పనిచేస్తుంటే వేరొకరికి ఆ సీటు ఇవ్వాలని జగన్ చూస్తున్నారని రాధా అన్నారు. అయితే తన భవిష్యత్ ప్రణాళికకు మరొక ఐదు రోజుల్లో తెలియచేస్తానని అన్నారు. ఇక అయన టిడిపి, లేదా జనసేనలో చేరే అవకాశం బాగా కనపడుతోందని సమాచారం. మరి అయన ఏ పార్టీలో చేరుతారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో వేచిచూడాల్సిందే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here