సంక్రాంతి సినిమాల విన్నర్ ఎవరు? ఏ సినిమా ఏ స్థాయిలో ఉందంటే?

0
21
నిజానికి సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు మన తెలుగు రాష్ట్రల్లో టాలీవుడ్ సినిమాల హడావుడి కూడా మొదలవుతుంది. ఇక ప్రస్తుతం సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో దాదాపుగా అన్ని మంచి టాక్ సంపాదించినప్పటికీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్2 సినిమా క్లియర్ విన్నర్ గా చెప్తున్నారు సినిమా విశ్లేషకులు. నిజానికి ఈ సినిమాని అనిల్ రావిపూడి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తీసారట. మంచి ఫన్ తో ఆద్యంతం ప్రేక్షకుడికి వినోదాన్ని ఇచ్చే ఈ సినిమా, రాబోయే రోజుల్లో మరింత హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో మంచి కథ, కథనాలు ఉన్నప్పటికీ కూడా సినిమాలో ఏదో కొంత లోపం ఉండడడం వలన, అనుకున్న విధంగా కలెక్షన్లు కూడా రావడం లేదు,
Image result for tollywood this pongal movies
ఇక ఈ సినిమా దాదాపుగా చాల చోట్ల ఒకమోస్తరుగా మాత్రమే కలెక్షన్లు సంపాదిస్తోంది. ఇక రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ పరిస్థితి ప్రస్తుతం పర్లేదు కానీ, రాబోయే రోజుల్లో మాత్రం మరింత కష్టంగా మారి, చాలావరకు నష్టాల్లో కూరుకుపోయే అవకాశం కనపడుతుందని అంటున్నారు. బోయపాటి మరొక్కసారి రొటీన్ డ్రామాగా దీన్నీ తెరకెక్కించారని, అంతేకాక విపరీతమైన అర్ధంలేని యాక్షన్ సీన్లతో సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం చేసారని టాక్ వినిపిస్తోంది. సో సినీ విశ్లేషకులు చెప్తున్నట్లు వస్తున్న టాక్ మరియు కలెక్షన్ల పరంగా వెంకీ, వరుణ్ ల ఎఫ్2 సినిమా ఈ సంక్రాంతికి అసలైన విజయంగా చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదనే చెప్పాలి….