సడన్ గా మోహన్ బాబు, ముద్రగడ భేటీ దేనికోసమో?

0
95
దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి విగ్రహావిష్కరణకు నేడు పాలకొల్లు విచ్చేసిన విలక్షణ నటులు మోహన్ బాబు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కలిసి కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. అయితే నిజానికి దాసరి గారి విగ్రహావిష్కరణకు తనను మాత్రం ఆహ్వానించలేదని ముద్రగడ చెప్పడంతో, మోహన్ బాబు అక్కడి అధికారులతో వారిని కూడా ఆహ్వానించి ఉంటే బాగుండేదని చెప్పారట. ఇక తనకు సినిమా జీవితం ఇచ్చిన దాసరి గారు తండ్రితో సమానమైతే,
కాపుల ప్రగతికి పాటుపడుతూ తన జీవితాన్ని పణంగా పెట్టిన ముద్రగడ గారు అత్యంత ఆప్తులని మోహన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిపారు. ఇక అయన రాకతో పాలకొల్లులో మోహన్ బాబు ఫ్యాన్స్ కార్యవర్గం మరియు కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను ఘనంగా సన్మానించారు. కాగా వారిద్దరి భేటీలో కేవలం సినిమాలు అలానే దాసరి గై జీవిత పరిస్థితులపై మాత్రమే చర్చ నడిచిందని, వారు రాజకీయాలు ఏ మాత్రం చర్చించలేదని మోహన్ బాబు సన్నిహితులు తెలిపారు. కాగా వారిద్దరి భేటీలో ఏదో ఆంతర్యం ఉందని, అయితే అది గోప్యంగా ఉంచారనేది కొందరు రాజకీయ విశ్లేషకుల మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here