భర్త వేధింపులకు …. సెల్ఫీ వీడియో తీసి ఆత్మ హత్యా చేసుకున్న

0
19

కర్నూల్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకున్నది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భారత వేదింపులు తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఆత్మ హత్య చేసుకున్నది. తన మొబైల్ సెల్ఫీ వీడియో రికార్డు చేస్తూ వాస్మాల్ తాగి ఆత్మ హత్య చేసుకున్నది. బాధితురాలును హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కర్నూల్ జిల్లా బొల్లవరంకు చెందిన మల్లేశ్వరి వెల్దుర్తి మండలం బోయినపల్లి పాఠశాలలో హిందీ టీచర్ పనిచేస్తుంది. ఆమె భర్త సుధాకర్ మరొక పాఠశాలలో తెలుగు టీచర్ పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు  కూడా ఉన్నారు. మద్యానికి బానిస అయినా సుధాకర్ రోజు తాగి వచ్చి భార్యను చిత్ర హింసలు పెట్టేవాడు. కూతుర్లను కూడా వేధించేవాడు. భర్త  పెట్టి వేదింపులు తట్టుకోలేక మల్లేశ్వరి సెల్ఫీ వీడియో తీసుకోమని వాస్మాల్ తాగి ఆత్మ హత్య చేసుకున్నది. స్థానికులు హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలు సెల్ఫీ వీడియోలో తన కుమార్తెలను తన భర్త వద్ద ఉంచవద్దని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here