అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య….మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

0
70

ప్రస్తుతం సమాజంలో వివాహబంధం చాలా వరకు అపహాస్యంగా మారుతోంది. నిజానికి నేటి యువత వినూత్న పోకడలు మరియు ఆలోచనలు, ఒకరిపై మరొకరికి కేవలం శారీరక అనుబంధం మాత్రమే ఉండడం, నిజమైన ప్రేమను కలిగివుండకపోవడం, తద్వారా అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పవిత్రమైన ఆ వివాహబంధాన్ని నాశనం చేసుకుంటున్నారని మానసిక నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. ఇక మ్యాటర్ లోకి వెళితే, పేరుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి, చేసేది మాత్రం తప్పుడు పనులు. 2007 వ సంవత్సరం లో నకిరేకల్ కు చెందిన నాగరాజు తో అమూల్య అనే అమ్మాయితో విహహం జరిగింది. అనంతరం వీరిద్దరికి అన్విక అనే ఎనిమిదేళ్ల పాప ఉంది. టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా పనిచేస్తున్న నాగరాజు, గత కొద్దిరోజులుగా తన సహోద్యోగి రాధారాణితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య అమూల్యను మరియు బిడ్డను పూర్తిగా నిర్లక్ష్యం చేసాడు.

అయితే అతడు హస్తినాపురం ద్వారకానగర్ లో రాధతో కలిసి వేరే కాపురం పెట్టిన విషయాన్ని పసిగట్టిన అతని భార్య అమూల్య, ఎట్టకేలకు నిన్న వారీద్దరిని రెడ్ హాండ్ గా పట్టుకుని ఆ విషయమై మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వారిద్దరిని పట్టుకున్న పోలీసులు, నాగరాజును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో కూడా తన అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నానని తన కూతుర్ని మరియు తనను హత్యచేయడానికి నాగరాజు పథకం పన్నాడని ఆరోపించింది. తన భర్త పై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతోంది అమూల్య. అయితే ఈ విషయమై మాట్లాడిన పోలీసులు, అమూల్య గారు ఫిర్యాదు మేరకు తాము నాగరాజును అదుపులోకి తీసుకున్నామని, అయితే పూర్తి విచారణ తరువాతనే అన్ని విషయాలు చెప్పగలమని అంటున్నారు. కాగా వారిద్దరిని పట్టుకున్న సమయంలో రాధ తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వైరల్ గా మారిన ఈ న్యూస్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here