మహేష్, విజయ్, యాష్ ఆ సినిమా చేస్తారా….మ్యాటర్ ఏంటంటే?

0
89
సూపర్ స్టార్ మహేష్, ఇళయదళపతి విజయ్, రాక్ స్టార్ యాష్, ఈ హీరోల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. మహేష్ బాబు ఒక్క బాలీవుడ్ సినిమా చేయనప్పటికీ కూడా అక్కడివారికి ఎంతో సుపరిచితం, ఇక విజయ్ మరియు యాష్ కూడా అంతే. విజయ్ కి వున్నా ఫోలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం కెజిఎఫ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి, దేశవ్యాప్తంగా తన పేరు మారుమ్రోగేలా చేసిన యాష్ కూడా ఇప్పుడు ఒక జాతీయ స్టార్. ఇకపోతే మ్యాటర్ ఏంటంటే,
Related image
ఇటీవల బెస్ట్ రచయిత్రిగా ‘ది హైవే మాఫియా’ అనే పుస్తకం రచించి అందరి మన్ననలు అందుకుని అవార్డు సొంతం చేసుకున్న సుచిత్ర ఎస్ రావు, తన పుస్తకం గురించి ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఒకవేళ నా పుస్తకం కనుక  సినిమాగా రూపొందవలసి వస్తే అందులోని అర్జున్ పాత్రకు నా ఫస్ట్ ఛాయస్ తెలుగులో అయితే మహేష్ బాబు, తమిళ్ లో అయితే విజయ్, అదే కన్నడలో అయితే యాష్ అని చెప్పారు. నిజానికి ఆ కథలో అర్జున్ అనేది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అని, దానికి వారు మాత్రమే పూర్తి న్యాయం చేయగలరని, ఆ హీరోలు వీలైతే తన పుస్తకాన్ని చదవాలని అన్నారు. మరి ఆమె అనుకుంటున్నట్లు ఆ హీరోలు నిజంగానే ఆ కలని నిజం చేస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు ఆగవలసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here