ఈ చిన్న సెట్టింగుతో మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ 50% ఆదా అవుతుంది!

0
64
మనలో చాలామంది మొబైల్ ఎంత జాగ్రత్తగా వాడుతున్నప్పటికీ కూడా ఫోన్ లో బ్యాటరీ ఎక్కువసేపు రాకుండా దిగిపోవడం వలన పలు రకాల సమస్యలు ఎదుర్కొంటూ వుంటారు. అయితే నెట్ వినియోగం రోజురోజుకు ఎక్కువ అవడంతో యూట్యూబ్ వీడియోలు అలానే ఇంటర్నెట్ సర్ఫింగ్ వంటివి విపరీతంగా చేయడం, దానికోసం ఇంటర్నెట్ ఎప్పుడూ మొబైల్ లో ఆన్ లో ఉంచడం వంటివి, అలానే మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ తాలూకు నోటిఫికేషన్స్ తరచు వస్తూ వుండడడం కూడా బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడానికి కారణాలుగా చెపుతున్నారు టెక్ నిపుణులు. అయితే మనం వాడే మొబైల్స్ లో ముఖ్యంగా ఎల్సిడి, ఏమోల్డ్ డిస్ప్లే గల రెండు రకాల మొబైల్స్ మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో వున్నాయి.
Image result for saving our mobile phone battery
అయితే ఎల్సిడి ముబైల్స్ ఎక్కువమంది వాడుతుండడంతో అందులోని పిక్సెల్ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వలన అవి బ్యాటరీని విపరీతంగా తీసుకుంటాయి. అదే ఏమోల్డ్ స్క్రీన్ వుండే శాంసంగ్ ఎస్9, వన్ ప్లస్ 6టీ వంటి కొన్ని మొబైల్స్ లో మాత్రమే ఈ తరహా స్క్రీన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ స్క్రీన్స్ వాడే వారికి యూట్యూబ్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి, అందులో జనరల్ అనే అప్షన్ లో ఎనేబుల్ డార్క్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే, వెంటనే మన యూట్యూబ్ స్క్రీన్ నల్లగా మారి, ఇకనుండి మనం చూసే వీడియోల బ్యాక్ గ్రౌండ్ దగ్గరినుండి అప్షన్స్ మరియు కామెంట్స్ తో సహా అన్ని బ్లాక్ కలర్లోకి మారి దాదాపుగా 40 నుండి 50 శాతం వరకు బ్యాటరీ వినియోగాన్ని కాపాడుతాయట. అంతేకాదు ఇది కొన్ని ఫలితాల ద్వారా కూడా నిరూపితం అయిందని చెపుతున్నారు నిపుణులు. మరి మీ దగ్గర కూడా ఈ తరహా ఏమోల్డ్ స్క్రీన్ వున్న మొబైల్స్ ఉంటే మీరు కూడా పైన చెప్పిన విధంగా యూట్యూబ్ లో చిన్న సెట్టింగ్ చేసి మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here