వెరైటీకి పోయి కాళ్ళు పోగొట్టుకున్న మహిళ… మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
86
ప్రస్తుత కాలంలో మనిషి రకరకాల నూతన పోకడలతో మరియు ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్నాడు. నిజానికి అవి ఎంతవరకు మేలు చేస్తున్నాయి అనే విషయం అటుంచితే మాత్రం, వాటివల్ల కొంత కీడు కూడా ఖచ్చితంగా జరుగుతోంది. మ్యాటర్లోకి వెళితే,
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో వెరైటీగా ఉంటుంది కదా అనుకుని ఆమె పాముల డిజైన్లతో ఉన్న లెగిన్స్ డ్రెస్ ను కొనుగోలు చేసింది ఒక మహిళ. ఇక తన భర్తను సరదాగా ఆటపట్టించడం కోసం రాత్రి ఆ లెగిన్స్ ధరించి నిద్రలోకి జారుకుంది.  ఇకపోతే రాత్రి సమయంలో పడక గదిలోకి వెళ్లిన భర్త చీకట్లో ఆమె కాళ్లను చూసి మంచం మీదకు పాములు వచ్చాయని భావించి ఒక్కసారిగా కంగారుపడ్డాడు. అంతే మెల్లగా అలికిడి చేయకుండా బేస్‌బాల్ బ్యాట్ తీసుకువచ్చి ఆమె కాళ్ల మీద బలంగా కొట్టాడు.
Image result for woman leg beats by husband thinking of snakes
ఆ దెబ్బకు ఆమె కెవ్వున కేకపెట్టింది. పామును చూసి ఆమె కేకలు పెడుతోందనుకుని ఇంకో రెండు దెబ్బలు గట్టిగా కొట్టాడు.  అంతే అరిచి కేకలువేసి భార్య,,,,అవి పాములు కాదు, నా కాళ్లు భోరుమంది. దీంతో భర్త లైట్లు వేసి అసలు విషయం తెలుసుకున్నాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆమె కాళ్లకు గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బ్యాట్ దెబ్బకు కాలు విరిగినట్లు వైద్యులు చెప్పారు. ఆమె చేసిన పనికి నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితిలో భర్త ఉన్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. మనిషి పిచిపోకడలకు ఇటువంటివి నిదర్శనమని పలువురు సోషల్ మీడియాలో ఈ ఘటనపై కామెంట్స్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here