అటవీ ప్రాంతంలో దారుణం

0
27

సుళగిరి అటవీ ప్రాంతంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకున్నది. ఓ మహిళను దుండగులు అత్యంత కిరాతంగా హత్య చేసి  ఆమె మృతు దేహంపై బండరాళ్లు వేసి పరారయ్యారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది పూర్తివివరాల్లోకి వెళ్తే సుళగిరి తాలూకా మేలమాలై వద్ద బాలకాండ రాయదుర్గంవద్ద ఓ మహిళను హత్య చేసినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.మహిళను హత్య చేసి తన ముఖం కనిపించుకుంటా కొండపై ఓ గోతిలోకి పడేసి ఆమె ముఖంపై బండరాళ్లను పడేశారు. పోలీసులు వాటిని తొలగించారు. మృతు దేహాన్ని పక్కకు తీసి పరిశీలించగా ఆమె వయస్సు 25నుండి 30 సంవత్సరాల వరకు ఉండవచ్చని భావిస్తాన్నారు.ఆమె తలపై బలమైన గాయం ఉండడంతో ఆమెను బండలరాయితో కొట్టి చంపేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎడమ చేతికి పచ్చ బొట్టు ఉంగరం ధరించిందని, ఆమె ధరించిన దుస్తులను బట్టి విద్యావంతురాలుగా  తెలుస్తుందని చెప్పారు. పోలీసులు మృతుదేహాన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి పోస్ట్ మార్టంకి తరలించారు. దుండగులు ఆమెను హత్యా చరానికి పాల్పడి చంపారా  లేదా ఇతర కారణాల వాళ్ళ చంపారో తెలియడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here