ప్రపంచంలోనే ఎతైన శివలింగం ఎక్కడ ఉందో,,,, దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

0
104
మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా శ్రీశైలం, అమరావతి, శ్రీకాళహస్తీలలోనివి పరమశివుని ఆలయాల్లో ఎంతో పేరెన్నికగన్నవి. ఇక ఈ ఆలయాల్లో శివ లింగాలు కూడా కొంత పెద్దగానే ఉంటాయి. ఇకపోతే ప్రస్తుతం మనం ఇపుడు చెప్పుకోబోయే విషయం ఏంటంటే,  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం మరియు దాని ప్రాశస్త్యం గురించి. ఇక వివరాల్లోకి వెళితే మొత్తం ప్రపంచంలోనే ఆయనంత ఎత్తైన శివలింగంగా ఉదయకుళంగర ప్రాంతంలోని లింగానికి గుర్తింపు లభించింది. తమిళనాడు మరియు కేరళ సరిహద్దుల్లోని చెంగల్‌ మహేశ్వర శివపార్వతి ఆలయ ప్రాంగణంలో ఈ శివలింగం నిర్మాణాన్ని 2012లో ప్రారంభించారు అక్కడి ఆలయ ధర్మకర్తలు. దాదాపుగా 111.2 అడుగుల ఎత్తుతో, ఎనిమిది అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ శివలింగం వ్యయ అంచనా రూ.10 కోట్లు పైమాటే.
Image result for worlds biggest shiva lingam
ఇక ప్రతి అంతస్తులోనూ ధ్యానమండపాలు కలిగిన ఈ శివలింగం లోపలి భాగం గుహలను తలపిస్తోంది. అందులో పరశురాముడు, అగస్త్యుడు తదితరులు తపస్సు చేస్తున్నట్లు కొన్ని ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇక కింది అంతస్తులో భక్తులు అభిషేకం, ఆరాధనలు చేసేందుకు అనువుగా శివలింగం, ఎనిమిదో అంతస్తులో కైలాసగిరిలో శివపార్వతులు ఉన్నట్లు ప్రతిమలు కూడా ఏర్పాటుచేయడం జరిగింది. ప్రస్తుతం 80 శాతం పైగా పనులు ముగిసిన నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా దీనికి గుర్తింపు లభించింది. అంతేకాక ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ద్వారా ఈ శివ లింగానికి గుర్తింపు లభించింది. అయితే వచ్చే మహాశివరాత్రి నాటికి మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని ఆలయ ప్రతినిధులు నిర్ణయించారు. కాగా ప్రస్తుతం ఈ శివలింగం ప్రపంచవ్యాప్తంగా మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here