అదరగొట్టే ఫీచర్లతో రెడ్ మీ నోట్ 7…. చూస్తే మతిపోతుంది!

0
49
ప్రస్తుతం మొబైల్ సంస్థలు రోజురోజుకి రకరకాల మోడల్స్ మార్కెట్ లోకి విడుదల చేస్తూ కస్టమర్స్ ని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవల కొన్నేళ్ల క్రితం భారత మార్కెట్ లోకి రంగప్రవేశం చేసిన షియోమీ సంస్థ, అనతికాలంలో తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లున్న మొబైల్స్ ని తమ కస్టమర్స్ కి అందిస్తూ ఇక్కడ మంచి మార్కెట్ ని ఏర్పరచుకుంది. ఇకపోతే షియోమీ లో ఇప్పటివరకు వచ్చిన రెడ్ మీ నోట్ సిరీస్ అన్ని మంచి విజయవంతం అయ్యాయి. ఇక నేడు షావోమి రెడ్‌ మి నోట్‌ సిరీస్‌లో మరో కొత్త డివైస్‌ను విడుదలచేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన ఒక ఈవెంట్‌లో రెడ్‌ మి నోట్‌ 7ను లాంచ్‌ చేసింది.  అంతేకాదు  డిఫరెంట్‌ డిజైన్‌, డ్యూడ్రాప్‌ న్యాచ్‌తో షావోమి  తొలి స్మార్ట్‌ఫోన్‌గా  రెడ్‌మి నోట్‌ 7 నిలవనుంది.  మూడు వేరియంట్లలో, బడ్జెట్‌ ధరల్లో వీటిని ఆవిష్కరించింది.  దీంతోపాటు రెడ్‌మి నోట్‌ 7ప్రొను కూడా తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో  ఒక్క కెమెరా తప్ప మిగిలిన ఫీచర్లన్నీ ఒకేలా ఉన్నాయి. చైనా మార్కెట్‌లో వీటి ధరలు మన కరెన్సీ ప్రకారం సుమారుగా  ఇలా ఉన్నాయి. వాటిపై ఒక లుక్ వేయండి…
3జీబీ ర్యామ్‌/ 32జీబీ స్టోరేజ్‌ ధర : 10వేల రూపాయలు, 4జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ ధర :  రూ.12,500, అలానే  6జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ ధర : రూ.14, 500… అయితే ఇవి ఖచ్చితమైన ధరలు కాకపోవచ్చని, కాగా దాదాపుగా మన మార్కెట్లో కొంచెం అటుఇటుగా ధరలు ఉండనున్నట్లు సంస్థ తెలిపింది…
రెడ్ మీ నోట్ 7 ఫీచర్స్ : 6.3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2340×1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ స్నాప్‌డ్రాగన్‌ 660 సాక్‌ 48+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా(ఏఐ ఆధారిత) 13ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఎమ్ఐయుఐ 9 ఆండ్రాయిడ్ ఓరియో