లైవ్ లో కొట్టుకున్న జనసేన దిలీప్ కళ్యాణ్, టిడిపి యామిని

0
74
గత కొద్దిరోజులుగా తాను నెలకొల్పిన జనసేన పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రజా పోరాట యాత్రలు చేపట్టిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆ యాత్రల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లలో పర్యటిస్తున్నారు. ఇకపోతే వెళ్లిన ప్రతీచోటా టిడిపి నాయకుల మోసాలను ఎండగడుతూ, ఎప్పటికపుడు చంద్రబాబు ప్రభుత్వ లోపాలను, పాలనను ఎత్తిచూపుతో ముందుకు సాగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసేవన్నీ అసత్య ఆరోపణలు, అయన కేంద్రంలోని బిజెపి పార్టీతో రహస్యపొత్తు పెట్టుకుని, వారితరఫున తొత్తులా వ్యవహరిస్తూ తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ టీడీపీ మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని ఇటీవల ఆయనపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక యామిని ఆరోపణలు నిరాధారమని, ఆమె కేవలం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ, తమ పార్టీ నాయకుడు, మరియు ఇతర నాయకులు చేస్తున్న తప్పులు వెనకేసుకొని వస్తుంది అంటూ జనసేన పార్టీ నాయకులు కూడా ఆమెపై కొన్ని ప్రత్యారోపణలు చేసారు.
ఇకపోతే నేడు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో ఇదే అంశంపై లైవ్ లో వాదించుకున్నారు జనసేన పార్టీ నాయకుడు దిలీప్ కళ్యాణ్ మరియు టిడిపి అధికార ప్రతినిధి సాధినేని యామిని. మొదట ఇద్దరు కొంత సౌమ్యంగా వ్యవహరించినప్పటికీ, తరువాత యామిని  పవన్ గురించి మాట్లాడుతూ, అన్న పార్టీ పెట్టిన సమయంలో అయన ఏమయ్యారు అంటూ విమర్శించగా, దానికి స్పందించిన కళ్యాణ్, రాష్ట్రాన్ని దొరికినంత దోచుకునే మీ నాయకుడు, మీరు మా అధినేతపై లేనిపోని ఆరోపణలు చేస్తారా అంటూ కళ్యాణ్ ఆమెకు బదులిచ్చారు. ఇక గతంలో యామిని చేసిన పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు పెళ్లి చేసుకోవడం అలానే ఆయనకు గదిలో మల్లెపూలు నలపడం మాత్రమే తెలుసు అన్న మాటను మరొక్కసారి లేవనెత్తడంతో, ఒక్కసారిగా ఫైర్ అయిన కళ్యాణ్ ఆమెపై కొంత విరుచుకుపడ్డారు.
ఇక అక్కడినుండి వారిద్దరి మధ్య చర్చ వ్యక్తిగత దూషణలకు వరకు వెళ్లడంతో, ఒక్కసారిగా చర్చ పెద్ద రసాభాసగా మారింది. ఇక ఆ సమయంలో దిలీప్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, ఆయనకు అక్క, చెల్లెల్లు, భార్య లేరా అంటూ ఆగ్రహించిన యామిని, అక్కడినుండి అమాంతం లేచి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో ఆమెను వారించడానికి ప్రయత్నించిన ఛానల్ వారిని కూడా అడ్డగించిన యామిని, వెనువెంటనే స్టూడియో నుండి బయటకు వెళ్లిపోవడంతో ఆ చర్చ అంతటితో ముగిసింది. ఇక ప్రస్తుతం ఈ చర్చావాదన మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తోంది. కాగా పలువురు నెటిజన్లు ఈ వీడియోని షేర్ చేస్తూ తమ వారికీ పంపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here