యాత్ర మూవీ రివ్యూ : వింటే మతిపోవలసిందే!

0
73
ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీల్లో బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఇప్పటికే తెలుగులో సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి మంచి విజయాన్ని అందుకోగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి బయోపిక్ గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా పర్వాలేదనిపించింది. ఇకపొతే దివంగత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన లేటెస్ట్ మూవీ యాత్ర. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా నేడు మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబడుతున్నట్లు సమాచారం. ఇక టీజర్ నుండి మొన్నటి ట్రైలర్ వరకు సినిమాలో అప్పట్లో వైఎస్ఆర్ గారు చేపట్టిన పాదయాత్రను ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమా రూపొందించినట్లు మనకు అర్ధం అవుతుంది. ఇక సినిమా ప్రారంభం నుండి మంచి ఆసక్తికరంగా మలచిన దర్శకుడు, ఆ ఫ్లో ని ఫస్ట్ హాఫ్ లో కొంత తడబడ్డాడని, అదీకాక ఫస్ట్ హాఫ్ లో పెద్దగా అలరించే అంశాలు కూడా లేవని సినిమా చూస్తున్నవారు చెపుతున్న మాట. ఇక అప్పట్లో చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన సమయంలో మళ్ళి కాంగ్రెస్ ని ఏపీలో అధికారంలోకి ఎలా తీసుకురావాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, వైఎస్ తో సంప్రదింపులు జరపడం,
Image result for yatra movie
ఆపై వైఎస్ గారు పాదయాత్ర చేపడితే ఎలా ఉంటుంది అని యోచన చేయడం వంటి అంశాలు చూపించారట. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుందని సమాచారం. ఇక సెకండ్ హాఫ్ లో యాత్ర ప్రారంభించడం, అలానే ఆ సమయంలో రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా తెలుసుకుని, వారి అవసరాలను తాను తప్పకుండ తీర్చి, సమర్ధవంతమైన పాలన అందిస్తానని చెప్పడం, ఆ విధంగా ఊరూరా, వాడవాడల సాగిన అయన యాత్ర, చివరికి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టడం వంటి అంశాలను చూపించారట. ఇకపోతే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే, సెకండ్ హాఫ్ చాలా బాగుందని అంటున్నారు. ఇక దర్శకుడు మహి వి రాఘవ్ సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించారని, ఇక వైఎస్సార్ గారి  పాత్రలో మమ్ముట్టి, అలానే అయన భార్య విజయమ్మ పాత్రలో ఆశ్రిత గారు ఎంతో బాగా నటించారని అంటున్నారు. ఇక ఈ సినిమా దాదాపుగా విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కలెక్షన్లు సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో ఆగవలసిందే …..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here