చంద్రగ్రహణం పూర్తయ్యాక తప్పనిసరిగా ఈ రెండు పనులు చేయండి!

0
84
నిజానికి చంద్రగ్రహణ సమయంలో మనలో హిందువులు చాలామంది కొన్నిరాకాల పనులు చేయరు. ఎందుకంటే హిందూ శాస్త్రాల్లో చంద్రగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహణం రోజున కచ్చితంగా నియమాలు పాటించాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని, కొన్ని రాశులు, నక్షత్రాల వారు గ్రహణం చూడరాదని, గర్భిణి స్త్రీలు అటూఇటూ కదలకుండా స్థిరంగా ఒకచోట ఉండాలని చెపుతుంటారు.
Image result for చంద్రగ్రహణం
అయితే గ్రహణం విడిచిన తరువాత మాత్రం ఒక రెండు పనులు మాత్రం తప్పనిసరిగా చేస్తే ఆ కుటుంబానికి విపరీతమైన లాభం మరియు శుభ్రం లభిస్తుందని ప్రతీతి. ముందుగా గ్రహణం అయిపోయాక, మన ఇల్లు మొత్తం శుభ్రం చేసి, అలానే పాత మరియు పగిలిన వస్తువులను బయట పారవేయాలి, అంతేకాక ఇంటిలో బూజు లేకుండా పూర్తిగా శుభ్రం చేసిన తరువాత తలారా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి నిష్ఠతో తమ ఇష్ట దైవాన్ని మనసారా పూజిస్తే మనకు సకల శుభాలు సిద్దించి, చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయట. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పనిని తప్పకుండ ఆచరించి మీరు కూడా దైవ కృపకు పాత్రులుకండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here