మన దేశ సంపద మొత్తం ఎంతమంది దగ్గర ఉందొ వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!

0
66
ఒకప్పుడు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లు దేశంలో డబ్బు ఆవశ్యకత విపరీతంగా పెరుగుతూ, మనిషికి మరియు ప్రాణానికి విలువ రోజురోజుకు మరింత తగ్గిపోతోంది. మనిషి పుట్టుక నుండి మరణించేవరకు ప్రతిదీ కూడా డబ్బులేకుండా జరగడం లేదు అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల మన దేశంలో ఎంతమంది కుబేరులున్నారు అని జరిపిన ఒక సర్వేలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. వారి నివేదిక ప్రకారం 2018లో కేవలం ఒక్కశాతం మంది ధనవంతుల సంపద 39 శాతం(రోజుకు రూ.2200 కోట్లు) ఎంతో పేరిటిది. ఇక అట్టడుగునున్న సగం మంది జనాభా సంపద కేవలం 3 శాతం మాత్రమే పెరిగిందని నివేదికలో వెల్లడైందట. ఆక్స్‌ఫామ్‌ అనే సంస్థ అధ్యయనంలో ఈ విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ముందు ఆక్స్‌ఫామ్‌ ఈ నివేదికను విడుదల చేసింది.
Image result for indian money
పేదలు తిండికోసం నకనకలాడుతుంటే, ధనవంతుల సంపద ఇలా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామమని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విన్నీ బ్యాన్యిమా అభిప్రాయపడ్డారు. ధనిక, పేదల మధ్య అంతరాన్ని తగ్గించడానికి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే ప్రజల్లో ఆందోళనలు పెచ్చుమీరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే దీనిప్రకారం పేదవాడు మరింత పేదవాడిగా, ధనికుడు మరింత కుబెరెదుగా మారిపోతున్నాడు అనేది పూర్తిగా అర్ధం అవుతోంది అని, ఈ పరిస్థితి ఎప్పుడైతే మారుతుందో అప్పుడే ఇండియా నిజంగా అభివృద్ధి చెందినట్లు అని అంటున్నారు ఆర్ధిక నిపుణులు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here