“ఎన్టీఆర్ కథానాయకుడు” మూవీ రివ్యూ : టాక్ వింటే ఆశ్చర్యపోవలసిందే!

0
68
దివంగత మహానటుడు మరియు ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి జీవిత గాథ ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే, ఇప్పటివరకు సినిమా చూసిన వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాపై కొంత మిశ్రమ స్పందన వస్తున్నట్లు అర్ధం ఆవుతోంది. ఇక సినిమా మొదలయిన దగ్గరినుండి ముగిసిపోయేవరకు సినిమాలోని ప్రతిపాత్ర ఎంతో ఆకట్టుకునేలా ఉండాలని దర్శకుడు క్రిష్ పడిన శ్రమ అద్భుతమని అంటున్నారు. ఇక సినిమాలో బాలకృష్ణ, విద్య బాలన్ ల నటన సూపర్బ్ అని, ముఖ్యంగా అప్పట్లో ఎన్టీఆర్ గారు నటించిన పౌరాణిక మరియు జానపద సినిమాల్లోని పాత్రల్లో ఇప్పుడు బాలకృష్ణ అచ్చంగా అలానే ఒదిగిపోయి నటించారని అంటున్నారు.
Image result for ntr kathanayakudu
ఇక ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని, మరీ ముఖ్యంగా కెమెరామెన్ జ్ఞానశేఖర్ అందించిన ఫోటోగ్రఫీ సినిమాకు వెన్నెముకగా నిలిచిందని చెపుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఎంతో జాగ్రత్త ఏరి కోరి తీయడం నిజంగా కష్టమని, ఆ విషయంలో దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడని టాక్. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాగుందని, ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎంతో ఆకట్టుకుని సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచుతుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ప్రధాన కీలక సన్నివేశాలు సినిమాలు ప్రాణంగా నిలుస్తాయని, అయితే ఎమోషన్లు పండించే సన్నివేశాలు మరింతగా పెట్టివుంటే బాగుండేదని కొందరు అంటున్నారు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ హృదయానికి హత్తుకుంటుందని, మొత్తంగా ఈ సినిమా తెలుగువారి మదిలో ఖచ్చితంగా గుర్తుండిపోయే సినిమాగా నిలవడం ఖాయమని మెజారిటీ ప్రేక్షకులు చెపుతున్న మాట…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here