వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు…!!

0
81
దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్సార్ గారి తనయుడు మరియు వైసిపి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు దాదాపుగా గత సంవత్సర కాలంగా ప్రజా సమస్యలను సునిశితంగా తెలుసుకునేందుకు వీలుగా ప్రజాసంకల్ప యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నిజానికి యాత్ర సమయంలో ఎన్ని ఒడిడుకులు ఎదురైనా సరే వాటిని లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో జగన్, పాదయాత్రను ఒక దీక్షలా కొనసాగించారు. ఇక నేడు ఈ యాత్ర ఆఖరిరోజున శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో ముగియనుంది. ఇక ఇక్కడ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే అక్కడికి వేలాదిగా వైసిపి నేతలు మరియు అభిమానులు చేరుకున్నారు.
 Related image
ఇకపోతే జగన్ పాదయాత్ర మొత్తంలో గల ప్రత్యేకతలు తెలుసుకుంటే మాత్రం చాలావరకు ఆశ్చర్యంవేస్తుంది. మొత్తం అయన ప్రజాసంకల్పయాత్ర జరిగిన రోజులు: 341….. పాదయాత్ర సాగిన నియోజకవర్గాలు: 134…… పాదయాత్రలో జగన్ తిరిగిన మొత్తం గ్రామాలు: 2,516….. ఇక పాదయాత్ర సాగిన మండలాలు: 231…. మొత్తం పాదయాత్ర సాగిన మున్సిపాలిటీలు: 54….. పాదయాత్ర సాగిన కార్పొరేషన్లు:  8…… అలానే ఆత్మీయ సమ్మేళనాలు: 55….. మరియు బహిరంగ సభలు: 124….. ఇంతలా ప్రజల వద్దకు వెళ్లి ఎప్పటికపుడు వారి సమస్యలను తెలుసుకున్న జగన్ పడిన కష్టం ఎంతమేరకు సఫల,మై ఆయన పార్టీకి రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని కట్టబెడుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు వేచిచూడవలసిందే….. !!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here