అదరగొడుతున్న యాత్ర మూవీ : ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

0
56
దివంగత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ నిన్న విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 970 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై  ప్రేక్షకుల దగ్గరినుండి సినీ విమర్శకుల వరకు అందరూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తమ నేతను మరోసారి గుర్తుకుతెచ్చారంటూ వైఎస్ఆర్ గారి అభిమానులు యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2003లో రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్రను కథా నేపథ్యంగా తీసుకుని దర్శకుడు మహి వి.రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక సినిమాలో కీలకమైన వైఎస్ గారి పాత్రను మలయాళ సూపర్‌స్టార్ ముమ్ముట్టీ పోషించారు. అయితే ఆ పాత్రలో అయన నటించారనడం కంటే జీవించారనే ప్రశంశలు విపరీతంగా వస్తున్నాయి.
Image result for yatra movie first day collections
ఇక టాలీవుడ్ కు చెందిన విజయ్ చందర్, ఆశ్రిత వేముగంటి,  రావు రమేష్, అనసూయ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల చేశారు.  మొదటిరోజు బెనిఫిట్ నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న యాత్ర, తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4కోట్లు వసూలు చేసినట్లు మూవీ అనలిస్టులు చెబుతున్నారు. ఇక యూఎస్‌లో ప్రీమియర్ షోల ద్వారా 71,289 డాలర్లు, ఫస్ట్ డే 100 లొకేషన్లలో 23,320 డాలర్లు వసూలు చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. హిట్ టాక్ రావడంతో తొలి వీకెండ్‌లోనే ‘యాత్ర’ మరింత మంచి కలెక్షన్ రాబట్టి, ఈ ఏడాది హిట్ సినిమాల లిస్టులు చేరడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here