ఒళ్ళు గగుర్పొడిచేలా ఆ డ్రైవర్ చేసిన సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే!

0
62
మన నిత్యజీవితంలో జరుగుతున్న కొన్ని యాక్సిడెంట్స్ చూస్తుంటే అవి ఖచ్చితంగా కొందరు బస్సు, కారు డ్రైవర్లు చేసిన తప్పిదం అనే అర్ధం అయ్యేవి చాలానే ఉంటున్నాయి. ఇక ఇటీవల ముంబై దగ్గర దీపావళి సమయంలో రావణుడి ఉత్సవం జరుగుతున్నపుడు ఒక ట్రైన్ డ్రైవర్ ఆపకుండా పోనిచ్చిన ఫలితంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే ఒక ఘటనలో ఒక డ్రైవర్ చేసిన సాహసం ప్రయాణీకులకు ఇటుంవటి ఇబ్బంది కలుగకుండా చేసింది. ఇక ఎప్పటివలె నేడు కూడా వెళ్తున్న హౌరా-ఎర్నాకుళం , అంత్యోదయ ఎక్స్ ప్రెస్,
టంగుగురు మరియు సింగరాయకొండ ప్రాంతాల మధ్యకు చేరుకోగానే కొందరు ప్యాసింజర్లు ట్రైన్ ను చైన్ లాగి ఆపారు. అయితే ఆ సమయంలో ట్రైన్ ఒక బ్రిడ్జి పై ఆగింది. ఇక విషయం గమనించిన అసిస్టెంట్ లోకో పైలెట్ ఆర్కే ఝా, తన బుర్రకు పనిపెట్టి, తెలివిగా బ్రిడ్జి కిందనుండి పాకుతూ వెళ్లి ట్రైన్ లాగిన కోచ్ వద్దకు చేరుకొని చైన్ ను పునరుద్ధరించడం జరుగుతుంది. ఇక ఈ ఘటన తెలుసుకున్న ప్రయాణీకులు మరియు ఉన్నత అధికారులు ఝా ధైర్యసాహసాలను విపరీతంగా పొగుడుతున్నారు. నిజానికి ప్రయాణీకులకు ఎటువంటి సమస్య రాకూడదని భావించి తాను ప్రాణాలకు తెగించి ఆ సాహసం చేసినట్లు ఝా అన్నారు. కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here