ఐఫోన్ కోసం ఒక కుర్రాడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు!

0
15

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగం రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. ఇక మరీ ముఖ్యంగా ప్రస్తుత యువత మొబైల్ ఫోన్ లేకుండా జీవితాన్ని గడపడం లేదు. నిజానికి తమ రోజులో ఎక్కువ భాగాన్ని ఫోన్ వాడకంతోనే గడిపేస్తున్నారు. ఇక రోజుకో రకం మొబైల్ ఫోను చొప్పున మార్కెట్ లోకి వస్తుండడంతో, యువత కూడా ఎక్కువగా ఒకే రకం మొబైల్ ఎక్కువ కాలం వాడకుండా  ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. ఇక తమకు నచ్చిన ఫోన్ ఎంత ధర వున్నా కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా వాటిని కొనేందుకు ఎంతకైనా పెట్టి కొనడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు అలా ఫోన్లు కొనుగోలు చేయడం కోసం కొందరు చేసేపనులు కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక ఆ విధంగా మొబైల్ ఫోన్ కొనుగోలుచేయడం కోసం ఏకంగా తన కిడ్నీ అమ్మాడో ప్రబుద్ధుడు.

వివరాల్లోకి వెళితే, చైనాలోని 17 ఏళ్ల కుర్రాడు జియావో వాంగ్‌ ఇటీవల ఒక మొబైల్ షాపులో లేటెస్ట్ ఐఫోన్ చూసాడు, దాని ఫీచర్స్ చూసి అది ఎలాగైనా కొనాలని నిశ్చయించాడు. అయితే, దానిని కొనడానికి తన ఆర్ధిక పరిస్థితి సరిపోదని తెలిసి, తన శరీరంలోని కిడ్నీ ని అమ్మెందుకు ఒక హాస్పిటల్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతా బాగానే వుంది, చివరకు అతడికి ఇటీవల చేసిన కిడ్నీ ఆపరేషన్‌ ఫెయిలై అతడు మరణించాడు. ఆపరేషన్ తరువాత అతడి రెండవ కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకిందని, ఆ విధంగా అతడు మరణించాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ వార్త మీడియా వేదికల్లో వైరల్ గా మారింది…..