నాగబాబు వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన చూస్తే ఆశ్చర్యపోతారు!

0
77
ఇటీవల నందమూరి బాలకృష్ణ తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని, అలానే జనసేన పార్టీ గురించి పెద్దగా మాట్లాడేది లేదని, అప్పట్లో అమితాబ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఏమి పీకారు, ఆ తరువాత అయన అన్నయ్య చిరంజీవి గారు వచ్చి చేసింది ఏమి లేదు అంటూ విమర్శించిన విషయం తెలిసిందే. ఇకపోతే తమ వంశం ఇండస్ట్రీలో పెద్ద చరిత్ర గల వంశమని, స్టార్స్ మరియు సూపర్ స్టార్స్ మేమె అని చెప్పడంతో ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు అయన వ్యాఖ్యలపై వరుసగా చేస్తున్న కామెంట్స్  చేస్తున్నారు… ఇక అయన కామెంట్స్తో నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎప్పుడో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ఇప్పుడు విమర్శలు చేయడంపై నందమూరి ఫ్యాన్స్ ఎవరికి తోచినట్లుగా వారు నాగబాబుపై విమర్శలు చేస్తున్నారు.
Image result for balakrishna on nagababu
మరో వైపు బాలకృష్ణ తన ‘ఎన్టీఆర్’ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. నిన్న బెంగళూరు వెళ్లిన బాలకృష్ణ నేడు చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు. తిరుపతిలో ఒక విలేకరి బాలకృష్ణ ను నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరాడు. ఇక పలువురు నాగబాబు వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన ఏంటా అని ఎదురు చూసారు. అయితే అటువంటివి తాను అసలు పెద్దగా పట్టించుకోనని, అయినా తనకు ఇటువంటి వాటికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, కాబట్టి నో కామెంట్ అంటూ సమాధానము ఇచ్చారు. కాగా మరొక్కసారి బాలకృష్ణ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం గా మారాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here