ఇటువంటి అభిమానిని ఎక్కడా చూసి ఉండరు….. ఏమి చేసాడో తెలుసా?

0
65
నిజానికి ప్రతిఒక్క నటి మరియు నటుల అభిమానులు, తాము ఇష్టపడే వారితో ఎలాగైనా ఒక ఫోటో దిగాలని, అలానే ఒకసారి కలవాలని అనుకోవడం సహజం. అయితే అందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ అలా కాకుండా తప్పు దారుల్లో వెళ్లి తమ అభిమాన నటులను కలిసేందుకు కొందరు చిక్కులు కొనితెచ్చుకుంటుంటారు. అటువంటి వ్యక్తిని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. వివరాల్లోకి  వెళితే, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంట్లోకి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి అర్థరాత్రి సమయంలో చొరబడి నానా హంగామా చేశాడు. గూగుల్ లో అక్షయ్ కుమార్ అడ్రస్ ను కనిపెట్టి మరీ వెళ్లి నట్లుగా చెబుతున్నాడు. హరియాణాకు చెందిన అంకిత్ బాలీవుడ్ లో నటుడిగా రాణించాలనేద కోరికతో తనకు అత్యంత ఇష్టమైన అక్షయ్ కుమార్ ను కలిసి తన కోరికను చెప్పాలనుకున్నాడు. అలానే అయన సాయంతో బాలీవుడ్ లో పరిచయం కావాలనే ఆశతో అక్షయ్ అడ్రస్ ను తెలుసుకుని మరీ అయన ఇంటికి వెళ్లాడు.
అయితే అక్షయ్ కుమార్ ఇంటి ముందు ఉండే సెక్యూరిటీ గార్డులు అతనిని లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. దాంతో అర్థ రాత్రి సమయంలో అక్షయ్ ఇంటి ఫెన్సింగ్ గోడను దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే అతడిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పెద్దగా కేకలు వేయడంతో అంతా అలర్ట్ అయ్యారు. వెంటనే బయట నుండి సెక్యూరిటీ గార్డ్స్ కొందరు లోనికి వెళ్లి అతడిని బలవంతంగా బయటకు తీసుకు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంకిత్ ను అరెస్ట్ చేశారు. తాను అక్షయ్ కుమార్ తో అభిమానంతోనే ఆ ఇంట్లోకి వెళ్లాను అని మరే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన్ను కలుసుకునేందుకు ప్రయత్నించాను అంటూ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. అక్షయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అంకిత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here