చంద్రబాబు ఇచ్చే హామీలు ప్రపంచంలో ఏ నాయకుడు ఇవ్వరు – జగన్ 

0
81
నిన్న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం తెలంగాణ ఎన్నికల సమయంలో వారు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న పొత్తుతో తేటతెల్లమైందని అన్నారు . ఇక ఈ నాలుగేళ్లలో అయన ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదని, ఇక అయన గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు చాలావరకు తుంగలోతొక్కరాని, అదేమిటని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.
Image result for ys jagan
ఒకవైపు ప్రజలు తమకు ప్రభుత్వ పధకాలు సరిగ్గా అందడం లేదని లబోదిబో మంటున్నారని, వాటి గురించి చంద్రబాబు వద్దకు ప్రజలు వచ్చి నిలదీస్తేగాని ఆయనకు తెలియదా అంటూ ఎద్దేవా చేసారు. నిజానికి ప్రపంచంలో చంద్రబాబు వంటి నేత ఎక్కడా ఉండరని, అయన ఇచ్చినన్ని హామీలు ప్రపంచంలో ఏ నేత ఇవ్వరని మండిపడ్డారు. ఇచ్చేవి వందల హామీలు, అమలు చేసేవి మాత్రంఒకటి, రెండు కూడా ఉండదు అంటూ చలొక్తులు పేల్చారు. ఇక గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్న బాబు, మరొక్కసారి ఆయనతో జతకట్టిన ఆశ్చర్యంలేదని అయన అభిప్రాయపడ్డారు. కాగా ప్రస్తుతం అయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here