వైఎస్సార్ బయోపిక్ లో విజయమ్మ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల…  ఆ పాత్ర ఎవరు చేసారంటే?

0
84
కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి, 2009లో హెలికాఫ్టర్ ప్రమాద ఘటనలో అకాలమరణం చెందిన దివంగత వైఎస్సార్ గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా యాత్ర. అయన జీవితంలో 2004కు ముందు అయన చేపట్టిన పాదయాత్రను హై లైట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాలో వైఎస్ జీవితానికి సంబందించి మనకు తెలియని కొన్ని విషయాలను కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారట దర్శకుడు మహి వి రాఘవ. ఇకపోతే ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా, అయన భార్య విజయమ్మ గారి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు.
అయితే కాసేపటి కృతమా చిత్రం యూనిట్ వారు, ఆమె పాత్రకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇక ఆమె పాత్రని సినిమాలో ఆశ్రిత వేముగంటి పోషిస్తున్నారు. ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న బాహుబలి-2 సినిమాలో ఆశ్రిత అనుష్క వదినగా నటించి అందరిని అలరించారు. ఇక ఈ లుక్ లో ఆమె అచ్చం విజయమ్మగారిని పోలినట్లు కనపడుతున్నారు. కాగా ఈ సినిమాని విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తుండగా, సినిమాని ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here