టీడీపీని టార్గెట్ చేస్తూ, వైసిపి సంచలన స్లోగన్…. తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే!

0
81
ప్రస్తుతం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే దాదాపుగా తన ప్రజాసంకల్ప యాత్ర ద్వారా సంవత్సర కాలం  పూర్తి చేయనున్నారు. ఇకపోతే ఈ యాత్ర ముగిసిన తరువాత కూడా ప్రజల్లోకి విరివిగా వెళ్లేందుకు ఆ పార్టీ మరికొన్ని నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అందులో భాగంగా మొదట ఒక బస్సు యాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లి, వారికి వైసిపి తరపున భరోసా కల్పించాలని చూస్తున్నారట. ఇక అంతేకాకుండా టీడీపీ ని టార్గెట్ చేస్తూ ఒక వెరైటీ స్లోగన్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
Image result for ysr congress tdp
అదేంటంటే, “నిన్ను నమ్మం బాబు” అనే స్లోగన్ తో ప్రజల్లోకి వెళ్లి, బాబు ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయం, దోచుకున్న సొమ్ము విషయమై నిజానిజాలు బయటపెట్టాలని చూస్తోందట. అయితే ఈ సరికొత్త స్లోగన్ తప్పకుండా తమకు లాభిస్తుందని వైసిపి వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విధంగా కాకుండా, ఒకవేళ అధికారాన్ని చేపడితే జగన్ ఏమేమి చేస్తారు అనే దానిపై ప్రజలకు మరింత స్పష్టత ఇస్తే బాగుంటుందని కొందరు వైసిపి పార్టీకి సోషల్ మీడియా వేదికల్లో సలహాలు ఇస్తున్నారు. మరి వైసిపి ఈ సరికొత్త స్లోగన్ వారికి ఏ మేర లాభిస్తుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here