టీడీపీ కట్టప్ప కత్తి పార్టీ అంటూ విమర్శించిన వైసిపి నేత….. వ్యాఖ్యలు వైరల్!

0
26
ఇటీవల కొద్దిరోజుల క్రితం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే…అయితే అప్పట్లో పెనుసంచలనం సృష్టించిన ఆ ఘటనలో జగన్ అదృష్టవశాత్తు చిన్న గాయంతో తప్పించుకుని బయటపడ్డారు. ఇక దాడి సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ తన అనుచరులతో కలిసి కుట్రపన్ని, తనపై తానే దాడి చేయించుకున్నాడని, ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో కావాలనే సానుభూతితో ఓట్లు దండుకోవడం కోసం వేసిన ఈ పన్నాగానికి ఓట్లు పడవని, అంతేకాక వైసిపి పార్టీని కోడికత్తి పార్టీ అని పలువిధాలుగా విమRelated imageర్శిస్తున్నారు..ఇక విషయమై నేడు స్పందించారు వైసిపి గుడివాడ ఎమ్యెల్యే కోడలి నాని…
ఆయన మాట్లాడుతూ, చంద్రబాబులాంటి నీచమైన వ్యక్తి ఎక్కడా లేడని, బాబును మించిన అవినీతి చక్రవర్తి ఈ దేశంలోనే ఎవరూ లేరంటూ ఆయనకు పిల్లనిచ్చిన మామ, స్వర్గీయ ఎన్‌టీ రామారావు గారు, బాబు గురించి ఆయన జీవితం గురించి ప్రజలందరికి అప్పట్లోనే చెప్పారన్నారు. ఇక ఇటీవల చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎన్నికలలో గుడ్డలూడదీసి పంపారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబూ నీ టైమ్ అయిపోయింది, కాబట్టి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుని పరిపాలన సాగించు అని హితబోధ చేసారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో బాబు ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా శంకుస్థాపనలు చేస్తున్నారని అన్నారు. ఇక బాబుగారు చెపుతున్నట్లు మాది కోడి కత్తి పార్టీ అయితే, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మీది కట్టప్ప కత్తి పార్టీయా’ అంటూ కొడాలి నాని విమర్శించారు. కాగా ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి…