తాత కాబోతున్న యువసామ్రాట్ నాగార్జున… మ్యాటర్ ఏంటంటే?

0
92
ఇటీవల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తీసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఇక ఆ సినిమాతో నాగార్జునకు మంచి మార్కెట్ కూడా పెరిగింది. అయితే అప్పట్లో ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమాను కూడా తీస్తాం అని నాగ్ ప్రకటించారు. అప్పటినుండి ఆ సినిమా కథపై కసరత్తు ప్రారంభించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, ఎట్టకేలకు కథను పూర్తి చేసాడని,
Image result for soggade chinni nayana
త్వరలోనే ఆ సినిమా ప్రారంహం కానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. కల్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చటంతో ఏప్రిల్‌ లోనే సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట నాగ్. ఈ సినిమాలో నాగ్‌తో పాటు నాగచైతన్య కూడా నటించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు నాగార్జున, నాగచైతన్య కే తాతగా కనిపించనున్నాడట. బంగార్రాజు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here